అమ్రిష్ పురి మనవడు హీరోగా ‘యే సాలీ ఆషికీ’ : ఈ నెల 22న విడుదల

దివంగత నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి హీరోగా పరిచయమవుతున్న ‘యే సాలీ ఆషికీ’ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్..

  • Publish Date - November 6, 2019 / 09:33 AM IST

దివంగత నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి హీరోగా పరిచయమవుతున్న ‘యే సాలీ ఆషికీ’ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్..

తనదైన శైలి నటనతో, మరీ ముఖ్యంగా కంచు కంఠంతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు అమ్రిష్‌ పురి. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారాయన.. ఇప్పుడు వెండితెరపైకి ఆయన వారసుడొస్తున్నాడు. ‘యే సాలి ఆషికీ’ తో అమ్రిష్‌ పురి మనవడు వర్ధన్‌ పురి హిందీ పరిశ్రమలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

శివలేఖ ఒబెరాయ్ హీరోయిన్‌గా పరిచయమవుతుంది.  చిరాగ్‌ రూపారెల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమ్రిష్‌ పురి ఫిల్మిమ్స్‌, పెన్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 22న విడుదల కానున్న ‘యే సాలీ ఆషికీ’ థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

Read Also : ఎవడేమనుకుంటే నాకేంటి : ‘తిప్పరామీసం’ – ట్రైలర్

కాలేజీలో తామిద్దరం ప్రేమించుకున్నామనీ, ఓ రోజు బ్రేకప్‌ చెప్పి తన నుండి దూరంగా వెళ్లిపోయిందనీ, మూడేళ్ల నుండి ఆమెను చూడలేదనీ, ఇప్పుడు తనపై ఎటాక్‌ కేసు ఎందుకు పెట్టిందో తెలియదని ట్రైలర్‌లో హీరో చెబుతాడు. కాలేజీలో అతడే తన వెంట పడ్డాడనీ, తాను ప్రేమించలేదనీ హీరోయిన్‌ చెబుతుంది. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే కథతో లవ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది.. నిర్మాతలు : జయంతిలాల్ గడా, రాజీవ్ అమ్రిష్ పురి.