లవర్స్‌కి నచ్చే లిరికల్ సాంగ్

నన్నేవీడి ఎటో వెళ్ళినావే లిరికల్ సాంగ్ రిలీజ్.

  • Publish Date - January 28, 2019 / 12:21 PM IST

నన్నేవీడి ఎటో వెళ్ళినావే లిరికల్ సాంగ్ రిలీజ్.

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, రిలయన్స్ ఎంటర్ టైన్‌‌మెంట్, ప్రిన్స్ పిక్చర్స్ అండ్ ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మిస్తున్న సినిమా, దేవ్. తెలుగులో అదే పేరుతో ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్ లుక్, టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం తమిళ్ ఆడియో రిలీజ్ అయ్యింది. తెలుగు ఆడియో జనవరి 14న రిలీజ్ అయ్యింది. రీసెంట్‌‌గా తెలుగు లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నన్నేవీడి ఎటో వెళ్ళినావే, నిన్నేవీడి ఎటూ వెళ్ళలేనే అనే హార్ట్ టచింగ్ సాంగ్ చాలా బాగుంది. హారిస్ జయరాజ్ బాణీలకు, చంద్రబోస్ అందమైన, మనసుకి హత్తుకునే పదాలు రాయగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా చక్కగా పాడారు.

ప్రేమికుల మధ్య ఎడబాటు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి పీక్ సిచ్చుయేషన్స్ ఈ సాంగ్ వింటుంటే, మన కళ్ళముందు కదలాడుతాయి. ఖాకీ తర్వాత కార్తీ, రకుల్ నటిస్తున్న సినిమా దేవ్ కావడం విశేషం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న దేవ్ మూవీ తెలుగు, తమిళ్‌లో రిలీజ్ అవనుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, విఘ్నేష్, అమృత, కార్తీక్ ముత్తురామన్, నిక్కీ గల్రానీ, రేణుక, వంశీకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : ఆర్ వేల్‌రాజ్, ఎడిటింగ్ : రూబెన్, సంగీతం : హారిస్ జయరాజ్.

లిజన్, నన్నేవీడి ఎటోళ్ళినావే సాంగ్…