Yevaritho Payanamu Lyrical Song released from Lovemocktail 2 movie
Lovemocktail 2 : 2020లో కన్నడ పరిశ్రమ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ మాక్‌టైల్’. డార్లింగ్ కృష్ణ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో కూడా రిలీజ్ చేసారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని కూడా తీసుకు వచ్చారు. కన్నడలోనే రిలీజైన ఈ సీక్వెల్ సూపర్ హిట్టుగా నిలిచింది.
దీంతో ఈ సీక్వెల్ ని కూడా తెలుగులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. నిర్మాత ఎంవిఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘ఎవరితో పయనం’ అనే సాంగ్ ని రిలీజ్ చేసారు. నకుల్ అభయాన్కర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేసారు.
Also read : Kalki 2898 AD : జగదేకవీరుడి డేట్‌ని వదిలేసి.. బాహుబలి డేట్ వైపు చూస్తున్న కల్కి..