Hit 3 : నాని సినిమా షూటింగ్‌లో విషాదం.. మ‌హిళా సినిమాటోగ్రాఫ‌ర్ మృతి

హిట్ 3 చిత్ర షూటింగ్‌లో విషాదం నెల‌కొంది

Young cinematographer Krishna kr passes away

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం హిట్ 3. ఈ చిత్ర షూటింగ్‌లో విషాదం నెల‌కొంది. ఈ చిత్ర బృందంలోని యువ మ‌హిళా సినిమాటోగ్రాఫ‌ర్ కేఆర్ కృష్ణ(30) మృతి చెందింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ జ‌మ్ము క‌శ్మీర్‌లో జ‌రుగుతోంది. అక్క‌డ ప‌లు స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో కేఆర్ కృష్ణ ఒక్క‌సారిగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ ఆమె చికిత్స పొందుతూ ఆమె క‌న్నుమూసింది. ఆమె ఛాతీ ఇన్‌ఫెక్ష‌న్‌తో మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. చిన్న వ‌య‌సులోనే ఆమె మ‌ర‌ణించ‌డంతో సినీ ఇండ‌స్ట్రీ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ ద‌గ్గ‌ర కేఆర్ కృష్ణ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నారు.

Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్‌కి కాల్ చేసిన చ‌ర‌ణ్.. రెబ‌ల్ స్టార్ రివేంజ్..?

ఎర్నాకులంకు చెందిన కృష్ణ కోదంబ్రం రాజన్, గిరిజ దంపతుల కూతురే కేఆర్ కృష్ణ‌. ఆమె తండ్రి కృష్ణ కోదంబ్రం రాజన్‌కు పెరుంబవూరు, కురుపంపాడిలో గిన్నిస్ స్టూడియోలు ఉన్నాయి.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ కృష్ణ మ‌ర‌ణం పై ఓ ఎమోష‌న్ పోస్ట్ చేసింది. కేఆర్ కృష్ణ అకాల మ‌ర‌ణం గురించి తెలియ‌జేయ‌డం ఎంతో బాధ‌గా ఉంది. ఆమె క‌శ్మీర్‌లో షూటింగ్లో ఉండ‌గా ఛాతీలో ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా గుండెపోటుతో క‌న్నుమూసింది. కృష్ణ ఓ నిష్ణాతురాలైన సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆమె డ‌బ్ల్యూసీసీలో చురుకైన స‌భ్యురాలు. ఆమె మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని తెలిపింది.

Vidaamuyarchi – Game Changer : సినిమాలు లేని సంక్రాంతి.. ఆ సినిమా వాయిదాతో చ‌ర‌ణ్‌కు క‌లిసి వ‌స్తుందా?