వైరల్ అవుతున్న ప్రభాస్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌

ప్రభాస్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

  • Publish Date - April 18, 2019 / 06:28 AM IST

ప్రభాస్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. డార్లింగ్ అలా అకౌంట్ ఓపెన్ చేసాడో, లేదో.. ఎలాంటి పోస్టులు పెట్టకుండానే ఏడు లక్షలమంది ఫాలో అవడం స్టార్ట్ చేసారు. కొద్దిగ్యాప్ తర్వాత ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో మరియు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, ఆ సినిమాలకి సంబంధించిన ఫోటో, లేదా, అప్‌డేట్ లాంటిది ఏదైనా ఇస్తాడేమోనని ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూసారు. కట్ చేస్తే ప్రభాస్ బాహుబలి-2 లోని స్టిల్ ఒకటి పోస్ట్ చేసాడు.

తన ప్రొఫైల్ పిక్‌గా అదే పిక్ పెట్టుకున్నాడు. ప్రభాస్ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటిస్తున్న సాహో 2019 ఆగష్టు 15 న విడుదల కానుంది.