రీసెంట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసారు..
అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో ఇదే లాస్ట్ మూవీ కావడంతో పెద్దలు, పిల్లలు అవెంజర్స్ చూడడానికి థియేటర్స్‌కెళ్తున్నారు. సమ్మర్ హాలీడేస్ కావడంతో చాలాచోట్ల టికెట్స్ త్వరగా అయిపోతున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసారు.
హైదరాబాద్,గచ్చిబౌలిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో నిన్నరాత్రి (మే 2) జగన్ అవెంజర్స్ మూవీ చూసారు. సడెన్‌గా జగన్ రావడంతో ప్రేక్షకులు ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. మాల్‌లో జగన్ నడుచుకుంటూ వస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.