Assam : 10 మంది చావుకు కారణమైన లారీ డ్రైవర్

ఛాత్ పూజ నిర్వహించుకోవడానికి 10 మంది భక్తులు ఆటోలో బయలుదేరారు. పూజలు నిర్వహించుకుని సంతోషంగా ఆటోలో ఇళ్లకు బయలుదేరారు.

10 Chhath Puja Devotees : దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కడో ఒకచోట ప్రతిరోజు రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ..తోటి వారి ప్రాణాలు పోగొట్టడమే కాకుండా..వారి ప్రాణాలు కూడా పోతున్నాయి. సంతోషంగా గడిపి..గమ్యస్థానాలకు చేరుకుంటామని అనుకుంటుండగానే..వారిని రోడ్డు ప్రమాదం కబలించి వేస్తోంది. తాజాగా..అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంగంజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.

Read More : Rain Alert : నెల్లూరు వాసులకు హెచ్చరిక…13 ఏళ్ల తర్వాత తుపాన్, టెన్షన్ టెన్షన్

ఛాత్ పూజ నిర్వహించుకోవడానికి 10 మంది భక్తులు ఆటోలో బయలుదేరారు. పూజలు నిర్వహించుకుని సంతోషంగా ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. కరీంగంజ్…నేషనల్ హైవే 8పై ఆటో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఎదురుగా అత్యంత స్పీడుగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 9 మంది స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది.

Read More : Pak soldier to Bharath Padma Shri: పాకిస్థాన్ సైనికుడికి భారత పద్మశ్రీ పురస్కారం..

చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, అత్యంత వేగంతో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మంత్రి Parimal Suklabaidya విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు