కేరళ అంటేనే చదువులకు పుట్టినిల్లు అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహంలేదు. అక్షరాస్యతతో నూటికి నూరుశాతం ఉన్న రాష్ట్రం.
త్రిసూర్: కేరళ అంటేనే చదువులకు పుట్టినిల్లు అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహంలేదు. అక్షరాస్యతతో నూటికి నూరుశాతం ఉన్న రాష్ట్రం. కానీ చదువుల తల్లులు పుట్టినిల్లుగా చెప్పుకునే కేరళలో ఓ బాలిక 10వ తరగతి పరీక్ష రాసేందుకు గుర్రంపై వెళ్లటం ఇప్పుడు వైరల్ గా మారింది.
పరీక్ష రాయడానికి గుర్రంపై వెళ్లడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసినా..‘దటీజ్ గర్ల్ పవర్’ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘‘ఆమె నా హీరో’’ అంటు ప్రశంసించారు . అంతేకాదు ఈ వీడియో గ్లోబల్‌గా వైరల్ కావాలని ఆకాంక్షించారు. కాగా ఆ బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా యూజర్లను ఆనంద్ మహీంద్రా కోరారు.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
‘అద్భుతం.. బాలికా విద్య పరిగెడుతోంది. ఈ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యే అర్హత ఉంది. ఇది కూడా ఉజ్వల భారత్‌కు నిదర్శనమే’ అని కామెంట్ చేశారు.‘ త్రిసూర్‌లో ఎవరికైనా ఈ బాలిక గురించి తెలుసా? నాకు ఆ అమ్మాయి, తన గుర్రం ఫొటో కావాలి. నా ఫోన్ స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకుంటా. ఆమే నా హీరో. స్కూల్ కు వెళ్లాలనే ఆమె తపన.. నాకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలను నింపుతోంది’ అంటూ సదరు బాలికపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు.
ఆనంద్ మహింద్రా ట్వీట్‌కు స్పందించిన కొంత మంది నెటిజన్లు ఆ బాలిక వివరాలను తెలియజేశారు. ఆమె పేరు కృష్ణ అని, ఆమె గుర్రం పేరు రణకృష్ణ అని తెలిపారు. గుర్రపు స్వారీలో తలపండిన వారిని తలదన్నేలా సవారీ చేస్తున్న ఆ అమ్మాయికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ వీడియోను మనోజ్ కుమార్ అనే నెటిజన్ పోస్టు చేశారు. ఆ బాలిక ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ కు గుర్రంపై వెళ్తోందనీ.. బాలిక కేరళలోని త్రిసూర్‌కు చెందిన అమ్మాయిగా ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను హీరో సాయి తేజ్, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
Brilliant! Girls’ education is galloping ahead…A clip that deserves to go viral globally. This, too, is #IncredibleIndia https://t.co/y1A9wStf7X
— anand mahindra (@anandmahindra) April 7, 2019
This video clip from my #whatsappwonderbox shows how a girl student is going to write her Class X final exam in Thrissur district, Kerala. This story made my Sunday morning brew of @arakucoffeein taste better! After all, ARAKU coffee is about #cupofchange #GirlPower @NanhiKali pic.twitter.com/45zOeFEnwV
— Manoj Kumar (@manoj_naandi) April 7, 2019
Read Also : రేపటి రౌడీలు : కత్తులతో కేక్ కట్ చేసిన స్టూడెంట్స్