కొత్త రూ.2వేల నోటులో 10 పాయింట్లు తప్పక తెలుసుకోండి

కొత్త రూ.2వేల నోటులో 10 పాయింట్లు తప్పక తెలుసుకోండి

Updated On : February 22, 2020 / 11:18 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త డిజైన్‌తో రూ.2వేల నోటును తీసుకొస్తుంది. మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న కొత్తనోటులోని కీలక విషయాలు తెలుసుకున్నారా.. కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉన్నాయట. మంగళయాన్ రివర్స్‌లో ఉండటమే కాదు మాగెంటా రంగులో రెడీ అయింది. 

బాగా పరిశీలిస్తే గానీ మారిన రంగుల్లో మార్పులు తెలియవు. కొత్త నోట్ సైజ్ ఎంతో తెలుసా.. 66mm x 166mmమాత్రమే. 

అందులో 10కీలకమైన విషయాలివే:
1. లైట్ వెలుగులో పెట్టినప్పుడు దాగి ఉన్న రూ.2వేలు గుర్తు కనిపిస్తుంది. 
2. కంటికి 45డిగ్రీల యాంగిల్‌లో 2వేల ప్రత్యేక సింబల్ కనిపిస్తుంది. 
3. 2000 సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది.  
4. కచ్చితంగా మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ.
5. ‘RBI’, ‘2000’ అక్షరాలు మైక్రో సైజులో.
6. నోటు కదిలిస్తుంటే ‘Bharat’, RBI,  2000అనే పదాలు రంగులు మారుతూ ఉంటాయి. గ్రీన్ నుంచి బ్లూ కలర్లో మారతాయి. 
7. ఆర్బీఐ చిహ్నానికి కుడివైపున గవర్నర్ సంతకం ఉంటుంది. 
8. మహాత్మాగాంధీ బొమ్మ, 2000గుర్తు వాటర్‌మార్క్, కుడివైపున అశోక పిల్లర్ చిహ్నం.
9. ఎడమ నుంచి కుడి వైపుకు నెంబర్లు సైజు పెరుగుతూ ఉంటాయి. 
10. కింది కుడివైపున 2000సంఖ్యలో గ్రీన్ నుంచి బ్లూ రంగు మారుతూ కనిపిస్తుంది. 

సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ.. బ్యాంకు నోట్లపై వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, సంఖ్యలో రంగులు మారుతూ ఉండటం, ఇంక్ కలర్లో మార్పు, బ్లీడ్ లైన్స్, యాంగిల్ మార్చి చూస్తుంటే మార్పులు, వంచి చూస్తే కనిపించే దాగి ఉన్న 2000సింబల్‍‌లు కొత్త నోట్లలో మార్పులు.