Firecracker Explosion : తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 10 మంది మృతి, మరో 15 మందికి గాయాలు

టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది.

Tamil Nadu Firecracker Explosion

Tamil Nadu Firecracker Explosion : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక – తమిళనాడు సరిహద్దులోని హోసూరు సమీపంలో గల అత్తిపల్లి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. దీంతో పది మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా టపాకాయల గోడౌన్ లో పనిచేస్తున్న వారుగా గుర్తించారు.

Blast : పశ్చిమ బెంగాల్ లో బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.