త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన వాటర్ ను 10 నెలల చిన్నారికి తాగిపించాడని ఆశా వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శానిటైజర్ కలిపిన వాటర్ తాగడం వల్లే చిన్నారి అనారోగ్యం పాలైందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
త్రిపుర ఊనకోటి జిల్లా సోనైముర గ్రామంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తన శిశువుకు పోలియో చుక్కలు వేయించేందుకు వచ్చింది. డ్రాప్స్ వేయించిన అనంతరం చిన్నారికి దాహం వేస్తోందని నీళ్లు ఇవ్వాలని తల్లి కోరింది.
అక్కడున్న ఆశా వర్కర్..నీళ్లు ఇచ్చారు. నీళ్లు తాగిన వెంటనే చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. శానిటైజర్ కలిపిన నీళ్లు ఇవ్వడం వల్లే..ఇలా అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.