పాములాగా కుబుసం వదులుతున్న బాలుడు..వింతవ్యాధితో నరకయాతన

  • Publish Date - June 1, 2020 / 09:58 AM IST

ఈ 10 సంవత్సరాల బాబుని చూస్తే..మెగాస్టార్ చిరంజీవి ‘‘పున్నమి నాగు’’ సినిమా గుర్తుకొస్తుంది. పాపం..అచ్చు పాములాంటి శరీరంతో నరకయాతన అనుభవిస్తున్నాడు. పాములకు కుబుసం ఊడినట్లుగా ఈ బాబుకు కూడా కుబుసంగా శరీరం ఊడిపోతోంది. పాము ఆరు నెలలకోసారి చర్మం పైపొరలను విడుస్తున్నట్లుగా ఈ బాలుడికి శరీరం ఊడిపోతుంటుంది. అచ్చంగా పాము కుబుసం విడిచినట్లుగానే. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 

పుట్టినప్పుడు అందరిలానే ఉన్నా..బాలుడు ఎదిగిన తరువాత పాములా మారిపోతున్నాడు. అతడి చర్మం పాము చర్మంలాగా పొరలు పొరలుగా ఏర్పడుతూ…నల్లగా మారిపోతోంది. అతడికి చెమట పట్టదు. పైగా శరీరమంతా పొడిబారిపోతుంది ఒడిశాలోని గంజాం జిల్లాలో నివసిస్తున్న జగన్నాథ్ అనే 10ఏళ్ల బాలుడికి. 

ఇదొక వింతైన చర్మవ్యాధి అని..వైద్య పరిభాషలో దీన్ని ‘లామెల్లార్ ఇచ్థియోసిస్’ అని అంటారని అంటున్నారు డాక్టర్లు. పుట్టేప్పుడు అతడిలో ఎటువంటి సమస్యా లేదు..కానీ..కొద్ది ఏళ్లకే జగన్నాథ్ లో మార్పు కనిపించడం మొదలైంది.

చర్మం రోజూ పొడిబారిపోయి బిగుసుకుపోతుంది.నల్లగా.. గట్టిగా అయిపోతుంది.జుట్టంతా రాలిపోతుంది. శరీరం వేడిగా అయిపోతుంది. అటువంటిసమయంలో పాపం జగన్నాథ్ నడవటానికి చాలా చాలా కష్టపడతాడు. కర్ర సహాయంతో అతి కష్టంగా నడుస్తాడు. ఆ కాస్తా నడవటానికి జగన్నాత్ మాయిశ్చరైజర్ ప్రతీ 15 నిమిషాలకొకసారి రాసుకోవాల్సిందే. కానీ జగన్నాథ్ శరీరం వేడికి అది వెంటనేఆరిపోతుంది. కానీ తప్పదు అలా రాసుకుంటూ ఉండాల్సిందే. లేదంటే మరింత గట్టిగా మారిపోతుంది శరీరం. అలా గట్టిపడిపోయిన చర్మం నల్లగా మారిపోయి నెలకు ఒకసారి అచ్చం పాము కుబుసంలాగా వీడిపోతుంది.  

దురదృష్టవశాత్తు ఈ వింత వ్యాధికి మందులు లేవని స్థానిక డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. జగన్నాథ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో ఏదైనా పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లే పరిస్థితి లేదు. 

కొడుకు పరిస్థితి గురించి జగన్నాథ్ తండ్రి ప్రభాకర్ ప్రదాన్  మాట్లాడుతూ..‘నా కొడుకు పుట్టినప్పుడు లేదు. కానీ కొంతకాలం అంటే చిన్ననాటి నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నాడు. వాడి బాధ చూసి మేము బాధ పడగలమే తప్ప పెద్ద పెద్ద వైద్యాలు చేయించలేకపోతున్నామనీ అసలు ఇటువంటి వింత రోగానికి మందులు ఉన్నాయో లేవో కూడా మాకు తెలీదంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.  నా బిడ్డను అలా చూస్తుంటే నా గుండె పగిలిపోతోంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆ పేద తండ్రి,  ‘లామెల్లార్ ఇచ్థియోసిస్’ అనేది చాలా అరుదైన సమస్య అని, ప్రపంచంలో ప్రతి 6 లక్షల మందిలో ఒకరికి భిన్న రకాల్లో ఈ సమస్య వస్తుందని, జగన్నాథ్‌కు వచ్చిన సమస్య చాలా తీవ్రమైనదని అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు.

Read: లాక్ డౌన్‌లో ఉపాధి లేక.. టిక్ టాక్ డ్యాన్సర్ అవతారమెత్తిన కారు క్లీనర్