NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు. అయితే..సోషల్ మీడియాలో 10 ఏళ్ల వయస్సున్న వారు కూడా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR) చేసిన పరిశోధనలు ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటపడ్డాయి.

10 Year Olds Have FB Accounts : స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైపోతోంది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు. అయితే..సోషల్ మీడియాలో 10 ఏళ్ల వయస్సున్న వారు కూడా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్మార్ట్ ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR) చేసిన పరిశోధనలు ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటపడ్డాయి. పది ఏళ్ల వయస్సున్న పిల్లల్లో 37.8 శాతం మందికి ఫేస్ బుక్, 24.3 శాతం మందికి ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది.

Read More : Gehlot vs Pilot : రాజస్తాన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

అయితే..వాస్తవానికి ఈ ఖాతాలు ఉపయోగించాలంటే..కనీస వయస్సు 13 ఏళ్లు ఉండాల్సి ఉంటుంది. NCPCR చేసిన పరిశోధనలో మొత్తం 5 వేల 811 మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. 3 వేల 491 మంది పాఠశాలల పిల్లలు, వేయి 534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 స్కూళ్ల స్పందనలు కూడా తీసుకున్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఈ పరిశోధనలు జరిగాయి. 8 నుంచి 18 ఏళ్ల వయస్సున్న వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు తేలింది. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.08 శాతం మంది ఆన్ లైన్ క్లాసుల కోసం వాడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

Read More : Bride Teasing Groom On Stage : పెళ్లిలో వరుడ్ని ఆటపట్టించిన వధువు

గమనించాల్సిన విషయం ఏమిటంటే…నిద్రపోయే ముందు వాడే వారి సంఖ్య 76.20 శాతం ఉండడం గమనార్హం. 23.80 శాతం మంది బెడ్ ఎక్కాక కూడా ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. 40 శాతం మంది మెసెంజర్లు, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్, 31 శాతం మంది మెటీరియల్స్ కోసం వాడుతున్నట్లు తేలింది. 15.80 శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30 శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అయితే..నిద్రపోవడానికి ముందు ఫోన్ వాడితే..పిల్లల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు