10 Young Women Escape From Delhi Shelter Home
10 young women escape from Delhi Shelter Home : ఢిల్లీలోని ఓ షెల్డర్ హోం నుంచి 10మంది అమ్మాయిలు తప్పించుకునా పారిపోయారు. హోంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి దూరి పారిపోయినట్లుగా తెలుస్తోంది. పరార్ అయిన యువతుల కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లోను గాలిస్తున్నారు. గత మార్చి నెలలో జీబీ రోడ్ రెడ్‌లైట్ జిల్లా నుంచి వీరిని కాపాడిన పోలీసులు వారిని షెల్టర్ హోమ్‌లో ఉంచారు. ఈ 10 మంది అమ్మాయిలు హోం నుంచి తప్పించుకుని పరారయ్యారు. తప్పించుకున్న వారంతా 17 నుంచి 26 ఏళ్ల లోపువారే.
ఈ ఘటనపై ద్వారక డీసీపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ..మే 24న 12 మంది మహిళల్లో 10 మంది తప్పించుకున్నారనీ..ఈ క్రమంలో ఇద్దరు యువతులు గాయపడ్డారని తెలిపారు. వీరి ఆచూకీ కోసం పలు మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చామని తెలిపారు. కాగా.. గాయపడిన ఇద్దరు అమ్మాయిలను పోలీసులు విచారించారు.
ఎందుకు హోం నుంచి తప్పించుకోవాలనుకున్నారని? అక్కడ మీకేమైనా ఇబ్బందులున్నాయా? ఒత్తిడిలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కానీ వారు మాత్రం తమపై ఎటువంటి ఒత్తిడి లేదని..కానీ షెల్టర్ హోంలో ఉండటం ఇష్టం లేదని అందుకే పారిపోవాలనుకున్నావని తెలిపారు. కానీ పారిపోయిన అమ్మాయిలు కూడా హోంలో ఉండటం ఇష్టంలేకనే పారిపోయారా? లేక వేరే కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.