Corona : 100 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

100 మంది నర్సింగ్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకొంది. అయితే కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా కరోనా సోకిన వారిలో కొద్దిమంది తాజాగా కేరళ నుంచి వచ్చిన వారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Corona

Corona : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు 40 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒకే కాలేజీకి చెందిన వందమంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో శుక్రవారం 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాలేజీలోని 48 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్ అని నిర్దారణ అయింది.

పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా గత నెల 17 నుంచి 21 మధ్య కేరళ నుంచి వచ్చారని అధికారులు గుర్తించారు. ఇక పాజిటివ్ నిర్దారణ అయినవాళ్లలో ఎవరికీ ఎటువంటి సింప్ట‌మ్స్ లేవ‌ని చెప్పారు. ఒకే కాలేజీలో 21 మంది విద్యార్థులు కరోనా బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాని చుట్టుపక్కల ఉన్న 9 మెడికల్ కళాశాలల్లోని 900 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 100 మందికి కరోనా నిర్దారణ అయింది.

వీరిలో చాలామందికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వారిలో 24 మంది మొద‌ట పాజిటివ్‌గా తేలిన 21 మందికి ప్రైమ‌రీ కాంటాక్ట్స్ అని ఆరోగ్య అధికారి డాక్ట‌ర్ విజ‌య్ వెల్ల‌డించారు. ఆ 24 మంది తొలి డోసు టీకా వేయించుకున్న వారేన‌ని చెప్పారు.