Independence Day : ఎర్రకోట వద్ద 10వేల పోలీసులు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో భారీభద్రత

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10 వేలమంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వతేదీన ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు....

Independence Day security at Red Fort

Independence Day : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10 వేలమంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వతేదీన ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హర్యానాలోని నుహ్, పరిసర ప్రాంతాల్లో ఇటీవలి హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (Independence Day security at Red Fort) ఈ వేడుకల్లో పలువురు వీఐపీలు పాల్గొననున్నందున ఎర్రకోట వద్ద 1000 ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. (10,000 cops, facial recognition cameras) ఎర్రకోట వద్ద సంప్రదాయం ప్రకారం డ్రోన్ నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

Floods In Himachal : హిమాచల్ వరదల్లో 257కు చేరిన మృతుల సంఖ్య

వాయు రక్షణ తుపాకుల ఏర్పాటుతో సహా అన్ని ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకున్నారు. స్పిపర్ డాగ్ లు, ఎలైట్ కమాండోలు, షార్ప్ షూటర్లు ప్రధానమంత్రి మోదీ, ఇతర వీఐపీలున్న ప్రాంతాల్లో మోహరించారు. కేంద్ర ఏజెన్సీల నుంచి అందిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అదనపు పికెట్‌లను కీలకమైన ఇన్‌స్టాలేషన్‌ల వద్ద మోహరించినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Seema Haider : నోయిడా ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమాహైదర్…సినిమా ఆఫర్ తిరస్కరణ

దేశ సరిహద్దుల్లోనూ సైనికులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఎర్రకోట సమీపంలోని ప్రాంతాల నివాసితులు ఈవెంట్ పూర్తయ్యే వరకు గాలిపటాలు ఎగురవేయవద్దని పోలీసులు కోరారు. ఢిల్లీ పోలీసులు పెట్రోలింగ్ , విధ్వంసక నిరోధక తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్‌లను తనిఖీ చేశారు.

Vande Bharat Express : ఒడిశా విద్యార్థులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉచిత ప్రయాణం

ఎర్రకోట పరిసర ప్రాంతాలు కార్యక్రమం పూర్తయ్యే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ పథకం లబ్ధిదారులతో సహా 1,800 మంది ప్రత్యేక అతిథులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సంవత్సరం 20వేల మందికి పైగా అధికారులు,పౌరులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. జ్ఞాన్ పథ్‌ను జాతీయ పండుగ కోసం అలంకరించారు. ఢిల్లీ అంతటా పలు ప్రభుత్వ భవనాలను మువ్వన్నెల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఢిల్లీ నగరంలో 3వేల మంది ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఢిల్లీలో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు