సిగ్గుచేటేనా : పుల్వామా సూత్రధారి ఫొటో కూడా మార్ఫింగ్‌దే

భారత మీడియా ఘోర తప్పిదం చేసిందా. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఫొటో

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 03:08 PM IST
సిగ్గుచేటేనా : పుల్వామా సూత్రధారి ఫొటో కూడా మార్ఫింగ్‌దే

Updated On : February 19, 2019 / 3:08 PM IST

భారత మీడియా ఘోర తప్పిదం చేసిందా. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఫొటో

భారత మీడియా ఘోర తప్పిదం చేసిందా. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఫొటో విషయంలో మిస్టేక్ జరిగిందా. ఉగ్రవాది ఫొటో మార్ఫింగ్ చేశారా. అంటే అవుననే  సమాధానం వస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి జైషే మహమ్మద్‌ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌  ఘాజీ అలియాస్‌ కమ్రాన్‌. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం 12 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌లో రషీద్‌ను మట్టుబెట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది,  తీవ్రవాదిని మట్టుబెట్టింది అని.. అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. వార్తతోపాటు సైనిక కమాండర్‌ దుస్తుల్లో ఉన్న కమ్రాన్‌ ఫొటోను పబ్లిష్  చేశాయి. ఇండియా టుడేతోపాటు ఏబీపీ న్యూస్, జీ న్యూస్, ఇండియా టీవీ, ఔట్‌లుక్, ది ఎకనామిక్‌ టైమ్స్‌ ఇలా ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఆ ఫొటోని చూపించాయి.

 

కమ్రాన్ ఫొటోకు సంబంధించి విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. అది రియల్ ఫొటో కాదని మార్ఫింగ్‌ ఫొటో అని తేలింది. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మీడియా వర్గాలను  షాక్‌కు గురి చేసింది. ఆ ఫొటోలో తల ఒకరిది కాదా, బాడీ మాత్రం మరొకరిది. రెండింటిని కలిపి ఫొటో చేశారు. మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం సిగ్గు చేటు అని నెటిజన్లు  అంటున్నారు.

 

ప్రముఖ అమెరికన్‌ పాప్‌ సింగర్‌ జాన్‌ బాన్‌ జోవి ఫొటోను తీసుకొని తలను మాత్రం మార్ఫింగ్‌ ద్వారా కమ్రాన్‌గా మార్చారు. పాప్‌ సింగర్‌ ఒరిజనల్‌ ఫొటోతోని పోల్చి చూస్తే ఇది మార్ఫింగ్‌ ఫొటో అని  ఈజీగా తెలుస్తుంది. జాన్ ఎడమ చేతి వాకీటాకీని పట్టుకొని ఉండగా ఆ చేతికి వాచీ కూడా ఉంటుంది. కుడిచేయి నడుము వరకు ఉంటుంది. ఆ రెండు చేతులే కాకుండా ఒంటి మీద ఉన్న దుస్తులు  కూడా కమ్రాన్‌ ఫొటోలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. మార్ఫింగ్‌లో ఫొటో బ్యాక్‌ గ్రౌండ్‌ను, ఫొటో కలర్‌ షేడ్‌ను కాస్త మార్చారు. అమెజాన్‌లోని Police Suit Photo Frame Maker అప్లికేషన్ ద్వారా  ఈ మార్ఫింగ్ ఫొటో చేశారు. ఒక యాప్ ద్వారా ఫొటోని మార్ఫింగ్ చేసిన నిజం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మీడియా చేసిన తప్పిదంపై  తెగ ట్రోల్ చేస్తున్నారు.