11 Covid Patients Died Due To Oxygen Supply
11 Covid Patients Death : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కొరతతోనే కరోనా రోగులు చనిపోయారంటూ వారి తరపు బంధువుల ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కరోనా బాధితుల మృతిపై స్పందించిన ఆస్పత్రి సిబ్బంది.. ఆక్సిజన్ అందకనే చనిపోయారంటున్నారు.
ఆక్సిజన్ కొరత కాదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన బాధితులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు మరణిస్తున్న పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది మృతి చెందారు.