సైకిల్ రిక్షాపై 500కి.మీ దూరంలోని సొంతూరుకి తల్లిదండ్రులను తీసుకెళ్తున్న 11ఏళ్ల బాలుడు

కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వలసకార్మికులే. ఉన్నచోట పనులు లేక,చేతిలో డబ్బులు లేక,నిన్న మొన్నటివరకు సొంతూళ్లకు వెళ్లే వీలు లేక నరకయాతన అనుభవించారు వలసకూలీలు. వలసకార్మికులను తరలించేందుకు రైల్వేశాఖ ఇటీవల కొన్ని ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ అన్ని చోట్లా అవి అందుబాబులో లేకపోవడంతో ఇంకా వేల సంఖ్యలో వలసకూలీలు వందల కిలీమీటర్లు హైవేలపై నడుస్తూ తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

రోడ్లపై వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తున్న  క్రమంలో కొందరు దురుదృష్టవశాత్తూ ప్రాణాలు కూడా కోల్పోయారు. లాక్ డౌన్ లో ఇలాంటి దయనీయ దృశ్యాలు ఎన్నో కనిపించాయి. అందరిని కంటతడి పెట్టించాయి. వలకూలీల్లోని గర్భిణీలకు కూడా రోడ్లపై వందల కిలోమీటర్ల నడక తప్పలేదు. 

అయితే ఇప్పుడు తబారే ఆలం అనే 11ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులను సైకిల్ రిక్షాపై కూర్చొబెట్టుకుని 500కి.మీ పైగా దూరంలోని సొంతూరుకు ప్రయాణం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని వారణాశి నుంచి…బీహార్ లోని అరారియాకు  తల్లిదండ్రులు కూర్చొన్న సైకిల్ రిక్షాను తొక్కుతూ ప్రయాణం చేస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్ లో తన తండ్రి సైకిల్ రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తుండేవాడని, అయితే లాక్ డౌన్ కారణంగా వారణాశిలో తాము ఆహారం దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ బాలుడు తెలిపాడు. 11ఏళ్ల తబారే తన తల్లిదండ్రులను సైకిల్ రిక్షాపై సొంతూరుకి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ వీడియోలో వైరల్ అవుతోంద