Woman Face: లైంగిక వేదింపులకు ఎదురుతిరిగిన యువతి ముఖానికి 118 కుట్లు
లైంగిక వేధింపులకు ఎదురుతిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువతిపై దారుణంగా దాడికి దిగారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఘటన అనంతరం సర్జరీ చేయించగా.. యువతి ముఖానికి 118 కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు.

Koti Womens College Lecturer Arrest In Sexual Abuse Case (1)
Woman Face: లైంగిక వేధింపులకు ఎదురుతిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువతిపై దారుణంగా దాడికి దిగారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఘటన అనంతరం సర్జరీ చేయించగా.. యువతి ముఖానికి 118 కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు. ఒక గ్రూప్ చేసిన దాడిలో యువతి ప్రతిఘటించింది. దాంతో వారు పేపర్ కట్టర్ తో ఘాతుకానికి పాల్పడ్డారు.
భోపాల్ లోని టీటీ నగర్ ఏరియాలో ఉన్న రోషన్పురా ప్రాంతంలో ఉన్న శ్రీ ప్యాలెస్ హోటల్ కు భర్తతో కలిసి వెళ్లిందా యువతి. అక్కడే బైక్ పార్కింగ్ దగ్గర చిన్నపాటి గొడవ జరిగింది. ఆమె భర్త హోటల్‌లో ఉండగా.. అసభ్యకరమైన పదజాలంతో దూషణకు దిగారు. యువతిని చూస్తూ విజిల్ వేయడంతో వాళ్లపై సీరియస్ అయింది మహిళ.
ఆ ముగ్గురిలో ఒకర్ని చెంపదెబ్బ కొట్టి.. హోటల్‌లో ఉన్న భర్త దగ్గరకు వెళ్లింది.
Read Also: భారత మహిళా సైకిలిస్ట్ కి లైంగిక వేధింపులు
కొంత సమయం తర్వాత హోటల్ నుంచి కపుల్ బయటకు వచ్చారు. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా ముగ్గురూ రౌండప్ చేశారు. యువతిపై పేపర్ కట్టర్ తో దాడి చేశారు. ఆమె భర్త వెంటనే హాస్పిటల్ కు తరలించగా.. తీవ్రమైన గాయాలకు వైద్యులు సర్జరీ చేశారు.
నిందితులు బాద్‌షా బేగ్, అజయ్ అలియాస్ బిట్టి సిబ్దేలను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితులైన జంటను కలిసి పరామర్శించారు. మెడికల్ ట్రీట్మెంట్ కు సరిపడ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళ చూపించిన ధైర్యానికి రివార్డుగా రూ.1లక్ష ఇవ్వనున్నట్లు చౌహాన్ హామీ ఇచ్చారు. నేరస్థులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.