COVID Slowing Down : ఈ రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కోవిడ్ కంట్రోల్ అయినట్టేనా?

భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. 

12 Hour Catch Up Covid Slowing Down In These States

COVID Slowing Down In These States : భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టినట్టు ప్రారంభ సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 రోజువారీ కొత్త కేసులలో తగ్గుదల కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

2. చండీగఢ్‌లో మే 4 నుంచి 11 వరకు అదనపు కోవిడ్ ఆంక్షలు :
పంజాబ్, హరియాణా, చండీగఢ్ రాష్ట్రాల్లో సోమవారం నుంచి అదనపు కోవిడ్ ఆంక్షలు విధించాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలు మే 4 నుంచి సాయంత్రం 5 గంటల
నుంచి మే 11 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి.

3. యువతకు వారంలో ఫైజర్ వ్యాక్సిన్.. FDA అంచనా :
యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అతి త్వరలో యువతకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందించేందుకు ఆమోదం తెలపనుంది. వచ్చే వారంలో 12ఏళ్ల వయస్సు నుంచి 15ఏళ్ల
యువతకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించనుంది. ఈ మేరకు ఫెడరల్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం
ప్రారంభమయ్యే నాటికి ఎక్కువ మొత్తంలో ఫైజర్ షాట్లు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

4. రక్తం గడ్డకడుతుందనే భయంతో జేఅండ్ జే వ్యాక్సిన్ వద్దన్న డెన్మార్క్ :
డెన్మార్క్ లో సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్-19 షాట్లను వ్యాక్సినేషన్ కార్యక్రమం నుంచి తొలగించింది అక్కడి ప్రభుత్వం. జేఅండ్ జే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో
రక్తం గడ్డకట్టి ప్రాణాంతకం మారుతుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు నివేదికలు హెచ్చరించడంతో ఈ వ్యాక్సిన్ డోసులను నిలిపివేసినట్టు వైద్యాధికారులు
వెల్లడించారు.