124 Years Woman Jab : జమ్మూ కశ్మీర్‌లో 124 ఏళ్ల బామ్మకు కరోనా టీకా..

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్‌ తీసుకుంది. కేంద్ర భూభాగంలో 9 వేల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు తెలిపారు.

124 Year Old Woman Covid Jab : జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 124 ఏళ్ల మహిళ కొవిడ్ -19 వ్యాక్సిన్‌ తీసుకుంది. కేంద్ర భూభాగంలో 9 వేల మందికి పైగా వ్యాక్సిన్ అందించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 124ఏళ్ల వృద్ధురాలి వయస్సుకు సంబంధించి ఎలాంటి రుజువు లేదని పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని 20 జిల్లాల్లో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులతో సహా మొత్తం 9,289 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు యూటీలో 33,58,004 టీకాలను అందించారు. టీకాలు వేసిన వారిలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన వందేళ్లు దాటిన మహిళ ఉందని అధికారులు వెల్లడించారు. ఇంటింటికి టీకాలు వేసే ప్రచారంలో భాగంగా ష్రాక్వారా బ్లాక్ వాగూరా నివాసి రెహతీ బేగం తన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ డోసును పొందారని తెలిపారు.


జమ్మూ కాశ్మీర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (DIPR) వృద్ధురాలు టీకా పొందడంపై ట్వీట్ చేసింది. ఆమె వయస్సు 124 సంవత్సరాలుగా పేర్కొంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. జపనీస్ మహిళ కేన్ తనకా ప్రస్తుతం 118 సంవత్సరాల వయస్సు కలిగిన అతి పెద్ద వ్యక్తి. రెహతీ బేగం వయస్సుపై అధికారిక ప్రకటన ఆమె కుమారుడి రేషన్ కార్డుపై ఎంట్రీ ఆధారంగా ఉంది.

దాని ప్రకారం ఆమె వయస్సు 124గా పేర్కొంది. ఆమె వయస్సుకు సంబంధించి రుజువు లేనందున అధికారిక ధృవీకరణ లేదు. ఆమె వయస్సు గురించి బృందం ఆమెను అడిగినప్పుడు.. 100 సంవత్సరాలు దాటిందని చెప్పింది. మహిళకు ఆధార్ లేదా ఎన్నికల కార్డు లేదని, ఆమె వయస్సుకు సంబంధించి కుటుంబం ఎటువంటి రుజువు ఇవ్వలేదని అధికారి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు