12th physics and chemistry papers leaks in maharashtra
Maharashtra: పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ రెండు పేపర్లకు ముందు లెక్కల పేపర్ లీకైంది. అయితే ఈ రెండు పేపర్లు లెక్కల పేపర్ కంటే ముందే లీకైనప్పటికీ కాస్త ఆలస్యంగా తెలిసిందని హెచ్ఎస్సీ బోర్డు లెక్కల పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ బృందం గురువారం తెలిపింది. మార్చి 3న లెక్కల పేపర్ లీక్ కావడానికి ముందే ఫిబ్రవరి 27న ఫిజిక్స్, మార్చి 1న కెమిస్ట్రీ పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. పరీక్షకు ఒక గంట ముందు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పేపర్‌ను షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో తొలుత అహ్మద్‌నగర్‌లోని మాతోశ్రీ భాగూబాయ్ భంబ్రే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చేసి వారి మొబైల్ ఫో న్లు సీజ్ చేసినట్లు చెప్పారు. వాట్సాప్ డేటా పరిశీలించగా మరో 2పేపర్లు లీక్ అయినట్లు ఆధారాలు లభించాయన్నారు.