West Bengal : పొలాల్లో పనిచేస్తుండగా పడిన పిడుగు .. 14మంది మృతి

వర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో పిడుగులు 14మంది ప్రాణాలు తీశాయి. బెంగాల్లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి 14మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం (ఏప్రిల్ 27,2023) బెంగాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షంతోపాటు పిడుగులు కూడా పడటంతో 14మంది చనిపోయారు. వీరిలో ఎక్కువగా ఎక్కువమంది పొలాల్లో పనిచేసుకుంటుండగా పిడుగు పడి చనిపోయివారే ఉన్నారు.

పూర్వ వర్ధమాన్ జ్లిలాలో నలుగురు,ముర్షిదాబాద్‌, ఉత్తర 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే పశ్చిమ మిడ్నాపూర్‌, హౌరా రూరల్‌ జిల్లాల్లో మరో ఆరుగురు పిడుగుపాటుకు చనిపోయారని అధికారులు తెలిపారు.దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, పూర్వ వర్ధమాన్‌, ముర్షిదాబాద్‌ జిల్లాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. వర్షాలు సాధారణంగానే కురిసినా వర్షంతో పాటు పడిన పిడుగులకే జనాలు ప్రాణాలు కోల్పోవటం గమనించాల్సిన విషయం.

5,450 Thunderstorm : అరగంటలో అల్లాడించిన 5,450 పిడుగులు .. వణికిపోయిన ఒడిశా వాసులు

కాగా మార్చి (2023)30న ఒడిశాలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. కేవలం అరగంటలో వేల సంఖ్యలో పిడుగులు పడ్డటంతో ఒడిశావాసులు హడలిపోయారు. పిడుగులు పడటం కాదు ఏకంగా పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Lightning strike..New Phosphorus : చెట్టుపై పడిన పిడుగు .. భూమిపై పుట్టిన కొత్త పాస్ఫరస్‌ పదార్థం..!!

 

 

ట్రెండింగ్ వార్తలు