అభిజ్ఞా ఆనంద్.. అతనొక బాల మేధావి.. మేధావే కాదు.. జరగబోయేది ముందే చెప్పేసి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు మైసూరుకు చెందిన ఈ ఏక సంతాగ్రహి. వాస్తవానికి ఎవరైనా ఏదైనా చెబితే.. అది సాధ్యం కాదులే అని అనుకుంటాం.. కానీ సాధ్యం అయితే మాత్రం అప్పుడే చెప్పాడే అనుకుంటాం.. కాకపోతే అప్పటికి మర్చిపోతాం కాబట్టి అసలు పట్టించుకోనవసరం లేదు.. కానీ ఈ బాలుడు చెప్పినదానికి మాత్రం నమ్మలేని వ్యక్తులు కూడా నమ్మితే తప్పేంటి అంటున్నారు. అసలు విషయం ఏంటంటే..
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టడం మొదలు పెట్టిన తర్వాత.. ఎంతో మంది ముందే మేం చెప్పాం కదా? అంటూ జ్యోతిష్యులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే మైసూరుకు చెందిన ఏకసంధాగ్రాహి పద్నాలుగేళ్ల అబ్బాయి అభిజ్ఞా ఆనంద్.. చెప్పిన, చెబుతున్న విషయాలను మాత్రం బాగా నమ్ముతున్నారు జనం. ఓ రుషిలా కనిపించే అభిజ్ఞా ఆనంద్.. వేదాలు చదివేశాడు… పలు భాషల్లో ప్రావీణ్యం పొందాడు.. అంతేనా చిన్న వయస్సులోనే ఎంంతో తెలిసినట్లుగా అన్నీ చెప్పేస్తున్నాడు. భవిష్యత్తు కూడా చెబుతున్నాడు.
ఇప్పుడు కూడా అలాగే చెబుతున్నాడు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ ఈ కరోనాకు సంబంధించి చాలా కీలకమైన దశ అంటున్నాడు అభిజ్ఞా ఆనంద్.. వాస్తవానికి అదే సమయానికి దేశంలో వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోతుంది. గ్రహ సంచార స్థితిని బట్టి.. ఈ మూడు రోజులు చాలా కీలకం అని చెబుతున్నాడు.
మాములుగా చెప్పే సిద్ధాంతులు, జ్యోతిష్కుల లెక్కలు వేరు.. ఇతను చెప్పే లెక్కలు వేరు.. ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో ఇటువంటి పరిస్థితి గురించి(కరోనా వైరస్ అని కాదు) 2020లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని, అందులో ప్రధానంగా చైనా సఫర్ అవుతుందని చెప్పాడు. రవాణా స్తంభించిపోయి జనం ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండిపోతారు అని చెప్పాడట.
దీనిపై లేటెస్ట్ గా మరో వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేశాడు. ‘‘నేను చెప్పిన వార్ నిజమే… ఒక వైరస్‌కూ ప్రపంచానికీ నడుమ జరుగుతున్న వార్ ఇది.. రవాణా స్తంభన కరెక్టే ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్లు, ఎయిర్ లైన్స్ స్తంభన నిజమే కదా… చైనా ప్రధాన సఫరర్ అనేదీ నిజమే కదా? వైరస్ అని మాత్రం చెప్పలేదు కానీ చెప్పినట్లే జరుగుతుంది కదా? అంటున్నారు.
ఇక మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 చాలా కీలకమైన దశ.. లోకానికి విషమపరీక్ష రెండు నెలలపాటు కొనసాగి మే 29 వరకూ పీడించి, ఆ తరువాత డైల్యూట్ అయిపోయి, ఆ పీడ నుంచి ఏప్రిల్ 2న మన గ్రహం విముక్తి పొందుతుందని అంటున్నాడు. 2019 ఆగస్ట్ 22న అతను చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుంది అని కొందరు అంటే… అంతా ట్రాష్ అని మరికొందరు అంటున్నారు అయితే ఎవరి నమ్మకం వారిది కదా? మంచి అయితే తీసుకోవడం.. చెడు అయితే వదిలేయడం అంతే..
Also Read | ఏపీలో కరోనా భయం : 23 మందిలో వైరస్ లక్షణాలు