కరోనా అంటే కోయి రోడ్ పర్ నా నిఖలే అని మోడీ అన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ నిధులతో ఐసొలేషన్ వార్డులు,ఐసియు బెడ్స్,వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య సదుపాయాల కల్పననే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్,ల్యాబ్ ల చొరవను అభినందిస్తున్నట్లు మోడీ తెలిపారు.
ప్రజలెవరూ వదంతులు,మూఢ నమ్మకాలను విశ్వసించవద్దన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులు ఇచ్చే సూచనలు పాటించాలన్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఎటువంటి మందులు వాడొద్దని మోడీ అన్నారు. సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇవాళ(మార్చి-24,2020)దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు.
ఇవాళ రాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షించడానికే ఈ నిర్ణయం అని మోడీ తెలిపారు. జనతా కర్ఫ్యూ కన్నా ఎక్కువ ఆంక్షలు ఉంటాయన్నారు. 21 రోజులు పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు.