16 Year Old Pune Boy Captures Stunning Photo Of Moon
Pune Boy : ఆకాశంలో ఉండే చందమామను హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఓ 16 ఏళ్ల కుర్రాడు. ఆ ఫొటోలను చూస్తే..చందమామను దగ్గరి నుంచి చూసిన అనుభూతి కలుగుతోందని పలువురు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ప్రతిమేష్ జాజు కుర్రాడు నివాసం ఉంటున్నాడు. చందమామను ఫొటో తీయాలని భావించాడు.
కానీ..అందరిలా కాకుండా..వెరైటీగా ఉండాలని భావించాడు. హై-రిజల్యూషన్‌తో ఫొటోలు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రాత్రి సమయంలో పూర్తి చంద్రుడిని ప్రతిమేష్ ఫోటోలు తీశాడు. టెలిస్కోప్, స్కై వాచర్ సాయంతో పాటు సొంతంగా తయారు చేసుకున్న మరి కొన్ని పరికరాలతో ప్రతిమేష్ చందమామ ఫొటోలను తీశాడు. బ్లర్ కాకుండా చంద్రుడు మొత్తం మంచిగా కనిపించేలా ఫొటోలు తీశాడు.
ఈ ఫొటోలను చూసిన వారు ప్రతిమేష్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. చందమామను దగ్గరి నుంచి చూసిన అనుభూతి కలుగుతోందని పలువురు వెల్లడిస్తున్నారు. అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More : Weather Report: అలెర్ట్.. రేపు ఏర్పడనున్న మరో అల్పపీడనం!