రాళ్లతో కొట్టుకోవటమే పండుగ : ‘గోట్మార్’లో 168మందికి గాయాలు

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 06:39 AM IST
రాళ్లతో కొట్టుకోవటమే పండుగ : ‘గోట్మార్’లో 168మందికి గాయాలు

Updated On : September 1, 2019 / 6:39 AM IST

పండుగల పేరుతో కర్రలతో కొట్టుకోవటం.. రాళ్లు కొట్టుకోవటం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ప్రతీ సంవత్సరం జరుపుకునే పండుగ ‘గోట్మార్’. ఈ పండుగలో రాళ్లతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా యువకులంతా ఓ చోట చేరారు.వాళ్లంతా చేతికందిన రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో 168 మందికి పైగా గాయపడ్డారు. 

పంధూర్న, సావర్గావ్ గ్రామాలకు చెందిన యువకులు ఒకరిపై మరొకరు రాళ్ళు రువ్వుకున్నారు. దీంతో ఇరు గ్రామాలకు చెందిన 168మందికి పైగా గాయాలైయ్యాయి. 
కాగా..గోట్మార్ పండుగలో భాగంగా చేసుకునే ఈ రాళ్ల దాడి జరుగుతుందనీ..శాంతి భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పోలీసులు మోహరించామనీ..పరిస్థితిని  డ్రోన్ల ద్వారా సమీక్షిస్తున్నామనీ కలెక్టర్ శ్రీనివాస్ శర్మ చింద్వారా తెలిపారు. గాయపడివారికి తగిన వైద్యం అందించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.