తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ గర్భం దాల్చిన అనంతరం 17 సంవత్సరాల బాలిక చెప్పింది. అనారోగ్యం ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత…వైద్యులు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది. సంవత్సరం కింద వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణానికి తెగబడ్డారని వెల్లడించింది. ఉదయాన్, శక్తి, రామ్ రాజ్ లు కారకులని తెలిపింది. కావేరిపట్టినమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పదో తరగతి అనంతరం బాలిక చదువు మానేసింది. ఒక్కసారి మామయ్య, మరొకసారి తల్లి ఇంట్లో ఈ బాలిక నివాసం ఉండేది. బాలిక మామయ్య ఇంటికి సమీపంలో ఉదయాన్ నివాసం ఉండేవాడు. బాలిక తల్లి ఇంటి దగ్గర శక్తి, రామరాజ్ లు ఉండేవారు.
ఈ క్రమంలో తనకు రుతుస్రావం రాలేదన బాలిక తల్లికి చెప్పగా..ఆసుపత్రికి తీసుకెళ్లకుండా లైట్ తీసుకుంది. కానీ..ఆమె కడుపు ఉబ్బుతుండడం కుటుంబసభ్యులు గమనించారు. ఏదో అనుమానం వచ్చి…ఆసుపత్రిక తీసుకెళ్లారు. 8 నెలల గర్భవతి అని వైద్యులు చెప్పారు. బాలికను కుటుంబసభ్యులు నిలదీశారు.
సంవత్సరం క్రితం ఉదయాన్, శక్తి, రామరాజ్ లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఉదయాన్, శక్తిని అరెస్టు చేశారు. తప్పించుకుని తిరుగుతున్న రామ్ రాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.