మెరుపు దాడి: భారీగా జంతువుల మృతి

 18 Elephants died : పెద్దఎత్తున్న పిడుగులు పడటం కారణంగా అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు చనిపోయినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మెరుపు దాడిలో జంతువులు చనిపోయినట్లు తెలుస్తుందని రాష్ట్ర అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఏనుగుల మరణం గురించి స్థానిక గ్రామస్తులు మాకు సమాచారం ఇచ్చారు.

ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం, ఏనుగులు చనిపోవడానికి అసలు కారణం, మరణాల సంఖ్య సరైన సమయంలో తెలుస్తుందని అటవీశాఖ తెలిపింది. అయితే తమకు తెలుస్తున్న దానిప్రకారం 18 ఏనుగులు చనిపోయాయని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపినట్టు వెల్లడించారు. నాగాన్ ఫారెస్ట్ డివిజన్‌లోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పిఆర్‌ఎఫ్) లో ఈ సంఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు