క్షేమంగా బయటికొచ్చిన బోరుబావిలో పడిన చిన్నారి

హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో బుధవారం(మార్చి-20,2019) సాయంత్రం ప్రమాదవశాత్తూ 60 అడుగుల బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారి శుక్రవారం(మార్చి-22,2019) క్షేమంగా బయటికొచ్చాడు.47గంటలపాటు NDRF, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ప్రస్థుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

బోరుబావిలో ఉన్నప్పుడు చిన్నారికి ఆక్సిజన్,బిస్కెట్లు,జ్యూస్ లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారి కదలికలను అనుక్షణం గుర్తించేందుకు ఓ నైట్ విజన్ కెమెరాను బోరుబావిలోకి పంపారు.60 అడుగుల లోతు ఉన్న బోరుబావికి 20 అడుగుల దూరంలో.. సమాంతరంగా మరో టన్నెల్ ని తవ్వి చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.