దేశంలో దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుంది. పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సూచనలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలు మార్లు సూచించింది. కానీ చాలామంది దాన్ని లైట్ తీసుకున్నారు. పాన్ కార్డులకు ఆధార్ ను అనుసంధానించుకోలేదు.
ఇలా చేయనివి దేశంలో దాదాపు 18కోట్లకుపైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం గడువు ఎన్నిసార్లు పొడిగించిన అదే నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో ఈసారి ప్రభుత్వం ఆఖరు సారిగా మార్చి 31,2020 వరకూ గడువు మరోమారు పొడిగించింది. అఇప్పటికీ చేయించుకోకపోతే ఆ పాన్ కార్డులు ఇక పనిచేయవని స్పష్టం చేసింది.
ఆధార్‌కార్డుతో లింకు చేయని దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులు దేశవ్యాప్తంగా ఉన్నాయనీ..మరోసారి ఇచ్చిన మార్చి 31 గడువులోగా వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ తెలిపింది. అప్పటిలోగా వీటిని అనుసంధానించకపోతే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని హెచ్చరించింది.
ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులు కలిగిన వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఐటీశాఖ తెలిపింది. కొందరు విలాసవంతంగా ఖర్చు చేస్తూ పన్నులు ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులను ఉపయోగిస్తున్నారనీ అటువంటివాటిని గుర్తించి రద్దు చేస్తామని తెలిపింది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానిస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు పొందే అవకాశం ఉండదని..కొంతమంది ట్యాక్స్ ఎగ్గొట్టటానికి ఇలా చేస్తుంటారని ఇకపై అది కుదరదని ఇచ్చిన గడువు లోగా చేయించుకోకుంటే వాటిని పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించింది.