మోడీకి రాహుల్ సవాల్…NRCవ్యతిరేక సీఎంలు ఆ పని చేయాలి

మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మోడీ ఇవాళ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా, దేశాన్ని కలవరపెట్టేందుకు, ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

సిఏఏ, ఎన్‌ఆర్‌సీ సహా పలు అంశాలకు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహ రచనకు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో 20 ప్రతిపక్ష పార్టీల సమావేశానంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు .’పోలీసులు లేకుండా ప్రధాని ఏ యూనివర్శిటీకైనా వెళ్లి….దేశానికి ఆయన ఏమి చేయబోతున్నారో చెప్పగలరా?’ అని రాహుల్ సవాలు విసిరారు.  తమ న్యాయబద్ధమైన వాణిని వినిపించే హక్కు యువతకు ఉందని, దానిని అణిచివేయరాదని, ప్రభుత్వం వారి గోడు వినిపించుకోవాలని రాహుల్ అన్నారు.

ఎన్ పిఆర్, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రులందరినీ జాతీయ జనాభా రిజిస్టర్ లేదా ఎన్‌పిఆర్ కోసం గణనను ఆపాలని ఈ సందర్భంగా విపక్షాలు కోరాయి .CAA, NPR, NRC అనేది రాజ్యాంగ విరుద్ధమైన ఒక ప్యాకేజీ అని, ఇది ప్రత్యేకంగా పేదలు, అణగారినవారు, ఎస్సీ / ఎస్టీలు మరియు భాషా మరియు మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటుందని. ఎన్‌ఆర్‌సికి ఎన్‌పిఆర్ ఆధారం ”అని ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఓ తీర్మాణాన్ని ఆమోదించారు. అనేక ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు. తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ మరియు డిఎంకె  పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. 
,