Shinde Camp MLAs: బీజేపీలోకి షిండే క్యాంపు ఎమ్మెల్యేలు.. త్వరలోనే వెళ్తారంటున్న ‘సామ్నా’

ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో 22 మంది త్వరలోనే బీజేపీలో చేరుతారని సామ్నా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ పత్రిక శివసేన పార్టీకి చెందిన పత్రిక అని తెలిసిందే.

Shinde Camp MLAs : షిండే క్యాంపులో చేరిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో త్వరలోనే 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని అభిప్రాయపడింది సామ్నా పత్రిక. ఈ పత్రిక ఉధ్దవ్ థాక్రేకు చెందిన శివసేన పార్టీ అధికార పత్రిక అనే సంగతి తెలిసిందే.

Tirumala Tirupati Devasthanam: రేపు 12గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత

ఈ అంశంపై తాజాగా సామ్నా ఒక కథనం ప్రచురించింది. షిండే క్యాంపులో ఉన్న 40 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది బీజేShinde Camp MLAsపీలో చేరతారని సామ్నా జోస్యం చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే షిండేను బీజేపీ సీఎం చేసిందని ఆ పత్రిక అభిప్రాయపడింది. ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా పోవచ్చనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. షిండే గ్రూపు అంధేరీలో ఒక అభ్యర్థిని నిలబెట్టాలనుకుంది. కానీ, దానికి బీజేపీ అడ్డు తగిలింది. సర్పంచ్, పంచాయతి ఎన్నికల్లో షిండే వర్గం విజయం సాధించింది అనడం నిజం కాదు. ప్రస్తుతం షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారు బీజేపీలో విలీనమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని సామ్నా పేర్కొంది.

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా దాదాపు ఖాయమైన రిషి సునక్

మరోవైపు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రణలో ఉన్నట్లు ఒక బీజేపీ లీడర్ చెప్పినట్లు ఆ పత్రిక వెల్లడించింది. షిండే తనకుతానే కాకుండా.. మహారాష్ట్రకు కూడా తీవ్ర అన్యాయం చేసుకుంటున్నారని, బీజేపీ తన స్వప్రయోజనాల కోసమే షిండేను వాడుకుంటోందని ఆ పత్రిక అభిప్రాయపడింది.

 

 

ట్రెండింగ్ వార్తలు