Oxygen Shortage : చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 24మంది మృతి

oxygen shortage దేశంలో ఆక్సిజన్‌ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్‌ కొరత సహా ఇతర కారణాలతో 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా కరోనా రోగులు ఆక్సిజన్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో మరణాలపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప..చామరాజనగర కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం అత్యవసర కేబినెట్‌ సమాశానికి పిలుపునిచ్చారు. ఇక,ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్‌కుమార్‌ తెలిపారు. మరణాలకు గల కారణాలపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆదివారం రాత్రి ఆ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కానీ, అన్ని మృతులక ఆక్సిజన్​ కారణం కాదు. దోషులపై చర్యలు తీసుకోవడం సహా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం ఈ హాస్పిటల్ కి తగినన్ని ఆక్సిజన్​ సిలిండర్లను సరఫరా చేయాలని పై అధికారులతో మాట్లాడాను. దీనిపై మేము ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేస్తాం అని సురేష్ కుమార్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు