కెనడాలో ఘోరం.. కారులో కూర్చున్న భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు 

చిగార్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు అడుతున్నారు.

కెనడాలో ఓ భారతీయ విద్యార్థి (24)ని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. దీనిపై అక్కడి పోలీసులు వివరాలు తెలిపారు. కెనడాలోని సౌత్ వాంకోవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరాగ్ అంటిల్ అనే విద్యార్థి కారులో విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

గన్ షాట్ల శబ్దాలు కూడా వినపడ్డాయని స్థానికులు తెలిపారు. ఈస్ట్ 55 అవెన్యూ మెయిన్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

దీనిపై స్పందించిన కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి ఎక్స్ లో ఓ పోస్ట్‌ చేశారు. ఆ విద్యార్థి కుటుంబానికి సాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. విద్యార్థి హత్యపై జరుగుతున్న దర్యాప్తుపై దృష్టి సారించాలని అన్నారు.

చిగార్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు అడుతున్నారు. హరియాణాలోని చిగార్ అంటిల్ సోదరుడు రోమిట్ అంటిల్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడితో ప్రతిరోజు మాట్లాడేవాడినని, అతడు హత్యకు గురయ్యే ముందు కూడా మాట్లాడానని చెప్పారు.

Also Read : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి.. ఏం జరిగింది..?

ట్రెండింగ్ వార్తలు