25 మంది స్టూడెంట్స్ కలిసి నడిరోడ్డుపై భారీ కత్తితో కేక్ కట్ చేసిన ఘటన కలకలం రేపింది.
బర్త్ డే వేడుకలు జరుపుకోవడం తప్పుకాదు.. పబ్లిక్ ఇబ్బందిపడేలా చేసుకోవడమే తప్పు. హాయిగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో వేడుకలు చేసుకోండి ఎంతో డిసెంట్ గా ఉంటుంది. వీధికెక్కి బర్త్ డే పార్టీలు చేసుకుంటే.. ఇలానే ఉంటుంది. 25 మంది స్టూడెంట్స్ కలిసి నడిరోడ్డుపై భారీ కత్తితో కేక్ కటింగ్ చేసిన ఘటన చెన్నైలో కలకలం రేపింది.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
నెల్సన్ రోడ్ శ్రీరంగం దగ్గర కాలేజీ కుర్రాళ్లంతా కలిసి పెద్దగా కేకలు వేస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 30 సెక్లన నిడివి ఉన్న వీడియోలో 25 మంది విద్యార్థులు ఓ స్కూటర్ పై భారీ కేక్ ను పెట్టి (రాయల్ 2 ఎం.కామ్) అని రాసి కత్తితో ఇద్దరు విద్యార్థులు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
విద్యార్థులంతా గట్టిగా కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో శ్రీరంగం పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు.
పబ్లిక్ లో న్యూషెన్స్ చేసిన స్టూడెంట్స్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావేరి బ్రిడ్జిపై నుంచి విద్యార్థులు ర్యాష్ గా డ్రైవ్ చేస్తు వెళ్తున్నారని, కాలేజీ కుర్రాళ్లా.. రౌడీలా అన్నట్టు ప్రవర్తిస్తున్నారని.. విద్యార్థుల ఆగడాలపై వెంటనే కాలేజీ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.
Read Also : పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్