శంషాబాద్ లో నకిలీ వీసాలు : 26 మంది మహిళలు  అరెస్ట్

  • Publish Date - March 13, 2019 / 06:40 AM IST

హైదరాబాద్ :  శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో నకిలీ వీసాల కలకలం చెలరేగింది. సాధారణంగా అధికారులు చేస్తున్న చెక్కింగ్ లో భాగంగా ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది. ప్రయాణీకుల వద్ద అధికారులు వీసాలను పరిశీలిస్తుండగా..26 మంది మహిళలు నకిలీ వీసాలతో కువైట్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో వీరందరినీ అధికారులు అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు..ఈ నకిలీ వీసాల వెనుకున్న  ఉన్నవారు ఎవరు..ఎక్కడ తయారుచేశారు. దీనికి అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.