Love Story: 67ఏళ్ల మహిళతో 28ఏళ్ల యువకుడు.. సహజీవనం కోసం పోరాటం

ఇదొక అసాధారణ ప్రేమకథ. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చిగురించిన ప్రేమ.. నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలుపడుతుంది. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని తపన..

Love Story

Love Story: ఇదొక అసాధారణ ప్రేమకథ. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చిగురించిన ప్రేమ.. నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలుపడుతుంది. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని తపన పడుతుంది ఆ జంట.

అడ్వకేట్ దిలీప్ అవస్తి తెలిపిన వివరాల ప్రకారం.. కైలారస్ లొకాలిటీకి చెందిన భోలూ అనే యువకుడు, రాంకలీ అనే మహిళ ప్రేమించుకుంటున్నారు కానీ, వివాహం చేసుకోవాలనుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమకు న్యాయం జరగాలని గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ లివ్- ఇన్ రిలేషన్‌షిప్ డాక్యుమెంట్ ను నోటరీ చేయాలని కోరుతున్నారు.

తమ రిలేషన్‌షిప్ గురించి భవిష్యత్ లో ఎలాంటి గొడవలు రాకూడదని.. ముందస్తు జాగ్రత్తగా నోటరీ చేసుకునేందుకు వచ్చినట్లు ఆ జంట పేర్కొంది.

Read Also : ఎనిమిదేళ్ల ప్రేమ, సహజీవనం-విషాదాంతం