Omicron Karnataka : కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు

కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది.

new Omicron cases In Karnataka : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,030కు చేరింది.

మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 314 మంది కరోనా బారిన పడి మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజు వారీ పాజిటివిటీ రేటు ముందుటి రోజు పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28కి చేరింది.

Corona Doctors : డాక్టర్లను వెంటాడుతున్న కరోనా.. ఉస్మానియాలో 159, గాంధీలో 120 మందికి పాజిటివ్

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరిందని ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సర్వీసెస్ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన వారిలో 60.9శాతం మందికి విదేశాల నుంచి వచ్చిన ట్రావెల్ రికార్టు లేదని, భారత్ లోనే ఇతరుల నుంచి వారికి ఈ వేరియంట్ సోకినట్లు తెలిపింది. ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైరాలజీ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు