ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 12 మంది

హెన్నూరు పరిధిలోని బాబూసాపాళ్యంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.

బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి.

శిథిలాల కింద 12 మంది కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. హెన్నూరు పరిధిలోని బాబూసాపాళ్యంలో భారీ వర్షం కురుస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రెస్క్యూ వ్యానులు ఘటనాస్థలికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. పలు ఏజెన్సీల సాయం కూడా తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.

భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవన నిర్మాణంలో నాసిరకపు పనుల వల్లే అది కుప్పకూలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవనం మొత్తం ఒకవైపునకు వంగి కుప్పకూలిపోయిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోనులో చిత్రీకరించారు.

Salman Khan : హత్య బెదిరింపులను పక్కనపెట్టి.. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సల్మాన్..