స్వచ్చమైన మనస్సు..ముద్దు ముద్దుగా పలికే మాటలు..వారి చిరునవ్వు..వారు చేసే చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. కదా. అమాయకత్వంతో కూడిన వారి చూపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. మూడు సంవత్సరాల చిన్నారి చేసిన కూని రాగాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వెరి వెరీ క్యూట్‌గా పాడిన పాట..ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
రోజా సినిమా…గుర్తుండే ఉంటుంది కదా. మధుబాల..అరవింద్ స్వామి జంటగా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఫేమస్. ‘చిన్ని చిన్ని ఆశ’ అంటూ హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ..వచ్చే పాట ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. హిందీ వెర్షన్‌లో ‘దిల్ హై చోటా సా’ అనే పాట పాపులర్ అయ్యింది.
My 3+ year daughter and her father performing together for the first time. Please bless her ?#DilHainChotaSa @arrahman @anandmahindra @hvgoenka @SrBachchan @narendramodi @akshaykumar @mangeshkarlata @shreyaghoshal @Singer_kaushiki @ShekharRavjiani pic.twitter.com/ZfvtingtTD
— Megha Agarwal (@Meghmadhav21) February 4, 2020
అయితే…సింగర్ మాధవ్ బినా అగర్వాల్ ఓ మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవ్..‘రోజా’ సినిమా పాటను పాడడం మొదలు పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెల్లిమెల్లిగా వినిపిస్తోంది. ఈ సమయంలో ప్రిన్స్‌లా తయారై..వేదికపైకి వచ్చింది మాధవ్ కూతురు వేద అగర్వాల్. పాట పాడుతుండగా..వేద అడ్డగించింది. తాను పాట పాడుతానని చెప్పింది తండ్రితో. ఒకే అన్నాడు మాధవ్. ఇద్దరం కలిసి పాడుదామని తండ్రి చెప్పాడు.
దీనికి వేద నో చెప్పింది. నేను ఒక్కదానినే పాట పాడుతాను అని ముద్దు ముద్దుగా చెప్పింది. ఇందతా చూస్తున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ప్రోత్సాహించారు. వెంటనే తండ్రిని వెనక్కి పంపించింది. అతను వేదికపైనున్న మ్యూజిషన్లు, ప్రేక్షకులకు తన కూతురిని పరిచయం చేశాడు. ‘దిల్ హై చోటా సా’ అంటూ మెల్లిగా పాటను పాడింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, గాత్ర మాధుర్యంతో పాట పాడింది. చివరి వరకు తన చేష్టలతో అందర్నీ ఆకట్టుకుంది.
చివరిలో ధన్యవాదాలు కూడా వెరైటీగా తెలిపి అందరి మనస్సులను గెలుచుకుంది ఈ చిన్నారి. ఈ క్రమంలో ఈ పాటకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది తల్లి మేఘ అగర్వాల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు ట్విట్టర్‌లో లక్షల మంది చూడగా…యూ ట్యూబ్‌లో సుమారు 84 వేల 477 మంది చూశారు.