భారతదేశంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా కలవరం ప్రారంభమైంది. బ్యాంకులో పని చేస్తున్న ఇతరులు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు, తిరుచిరప్పల్లిలోని నేషనల్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ లో పని చేస్తున్న 38 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చిందని తేలింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంకుకు వచ్చిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఇదే బ్యాంకులో పని చేస్తున్న బ్యాంకు అధికారి కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. దీంతో బ్యాంకులో పని చేస్తున్న వారికి కరోన పరీక్షలు చేయించగా…ఈ విషయం బయటపడినట్లు సమాచారం. 2020, జులై 27వ తేదీ సోమవారం నుంచి బ్యాంకు యదావిధిగా పని చేస్తుందని తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. 2 లక్షల 06 వేల 737 మందికి కరోన వైరస్ సోకింది.