Madhya Pradesh బాలుడిని రక్షించబోయి.. బావిలో పడ్డ 30 మంది.. ఇద్దరు మృతి!

మధ్యప్రదేశ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో బాలుడిని రక్షించేందుకు వెళ్లి దాదాపు 30 మంది గోడ కూలి బావిలో పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

30 People Fall Into A Well In Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో బాలుడిని రక్షించేందుకు వెళ్లి దాదాపు 30 మంది గోడ కూలి బావిలో పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బావిలో పడిన వారిలో 20 మందిని రక్షించగా, 10 మంది లోపల చిక్కుకున్నట్లు చెబుతున్నారు. బాలుడిని రక్షించిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

అంతకుముందు బావిలో పడిపోయిన బాలికను రక్షించడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జిల్లా ప్రధాన కార్యాలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజ్ బసోడ వద్ద జరిగింది.

ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బావిలో పడ్డ వారిని బయటికి తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ఇప్పటిదాకా కొంతమందిని రెస్క్యూ చేశాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు. అటు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటన స్థలంలోనే ఉండి సహయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాలతో మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ను ఘటనస్థలికి వెళ్లారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు