Aero India 2019 : 300 కార్ల దగ్ధం, ఏరో ఇండియా షో నిలిపివేత

  • Publish Date - February 23, 2019 / 10:13 AM IST

ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో 300 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో పార్కింగ్ వద్ద, కార్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం కలుగలేదు. ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ Air Show ని ప్రారంభించారు. 5 రోజుల పాటు జరగాల్సిన షో ప్రమాదంతో నిలిపివేశారు. 
Read Also: ఎయిర్ షోలో బీభత్సం : మంటల్లో 100 కార్లు

షోకు సమీపంలో సుమారు 60 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. శనివారం వీకెండ్ కావడంతో షో చూడటానికి చాలా మంది ఫ్యామిలీతో వచ్చారు. పార్కింగ్‌లో కార్లు ఉంచేసి షోకు వెళ్లిపోయారు. అయితే..ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండిన గడ్డి ఉండడంతో మంటలు విస్తృతంగా వ్యాపించాయి. ఒకదాని తరువాత ఒకటి కార్లు కాలి పోయాయి. విషయం తెలుసుకున్నవారు పార్కింగ్ వద్దకు పరుగులు తీశారు. కార్లను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కళ్లెదుటే ఖరీదైన కార్లు కాలిపోయాయి.

షోకు వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోరా ? అంటూ మండిపడ్డారు. తమ ఖరీదైన కార్లు కాలిపోయాయని..దీనికి ఎవరు సమాధానం చెబుతారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపణలు గుప్పించారు. 
Read Also: సిగరెట్ పీక.. 300 కార్లను బూడిద చేసింది

రూ. 66.48 కోట్లకు ముంబైకి చెందిన ఆర్ అండ్ బి కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. వేలం ద్వారా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు దగ్గరి వారు కాంట్రాక్టు దక్కించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని సూచించారు.