ముంబైలోని 37ఏళ్ల వ్యక్తి కాలింగ్ బెల్స్ కొడుతున్నాడని అరెస్టు చేశారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారిని బెల్ కొట్టి బయటకు రప్పించడం, తర్వాత మాయమవడం అతను చేస్తున్న పనికి స్థానికులు విసిగిపోయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉంటున్న ప్రేమ్ లాల్ సింగ్ నేపాలీ ఆదివారం ఓ బంగారు నగల వ్యాపారి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు.
అర్ధరాత్రి 2గంటలకు బెల్ కొట్టి దాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు పట్టించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘అతను డోర్ బెల్ కొట్టాడు. తప్పించుకోవాలని చూస్తుండగా చుట్టుపక్కల ఉండే వారు పట్టుకుున్నారు. నిందితుడు బూతులు తిడుతుండటంతో అతనిపై కంప్లైంట్ ఇచ్చారు. 100కు డయల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్లేలా చేశారు’ అని అధికారి వెల్లడించారు.
పోలీసుల విచారణలో ఆల్కహాల్ తీసుకున్నానని మత్తులో అలా చేశానని చెప్పాడు. ఆ వ్యక్తికి ఇలా చేయడం కొత్తేం కాదు. చాలా మంది స్థానికులు ఇలాంటి కంప్లైంట్‌లు ఇస్తూ వచ్చారు. సెప్టెంబరు 2018లోనూ ఇతనిపై ఇలాంటి కేసు నమోదైంది.
పరిశోధనలో భాగంగా అతణ్ని అరెస్టు చేశాం. అప్పుడే తెలిసింది సెప్టెంబరు 2018లోనూ అతని పేరు మీద కేసు నమోదైందని. అప్పుడు హెచ్చరించి వదిలేశాం. ఈ సారి స్థానికులు ఏమాత్రం ఉపేక్షించకపోతుండటంతో కేసు నమోదు చేశాం. ఇంత చిన్న విషయానికి పోలీస్ కంప్లైంట్ ఏం ఇస్తాడులే అనుకున్నాడేమో. ఈ సారి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుు నలుగురు సిద్ధంగా ఉన్నారు’ అని పోలీసులు వివరించారు.