38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

  • Publish Date - September 15, 2020 / 07:14 AM IST

గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది.



బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. 01.01.2015 నుంచి 31.12.2019 మధ్య 38 మంది బ్యాంకుల్లో అవకతవకలపై పాల్పడి దేశాన్ని విడిచిపారిపోయారని, దీనిపై సీబీఐ కేసులు నమోదు చేసిందని తెలిపారు.
https://10tv.in/itr-e-filing-know-how-to-e-file-your-income-tax-return/
20 మందికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిందని, 14 మందిని అప్పచెప్పాలనే అభ్యర్థనలు పంపారన్నారు. 11 మందిపై Fugitive Economic Offenders Act కేసులు నమోదయ్యాయన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 10 కోట్లు మోసం చేసిన Sunny Kalra, రూ. 40 కోట్లు మోసం చేసిన Vinay Mittal లను భారతదేశానికి తీసుకొచ్చారన్నారు.



పరారీలో ఉన్న వారి జాబితాలో విజయ్ మాల్యా ఉందని, ఇతనిపై 9 వేల కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. Nirav Modi, Mehul Choksi కుటుంబాలు రూ. 12 వేల కోట్లు, Sandesaras రూ. 15 వేల కోట్ల మోసం చేసిన ఆరోపణలున్నాయి. కెనరా బ్యాంకుల ఆధ్వర్యంలోని ఆరు బ్యాంకులను రూ. 350 కోట్లు చేసినట్లు మంజిత్ సింగ్ (Makhni Director of Punjab Basmati Rice Ltd) ఆరోపణలున్నాయి.