Ima2
IMA కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ హెచ్చరించింది. గతంలో మహమ్మారులను చూసినా తెలుస్తుంది. థర్డ్ వేవ్ తప్పదు. అయినా ఇలాంటి కీలక సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేడుకలు చేసుకుంటున్నారని ఐఎంఏ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ఘోరమైన సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడే భారత్ బయటపడిందని ఐఎంఏ తెలిపింది. ఈ సందర్భంగా మెడికల్ సమాజానికి మరియు రాజకీయ నాయకత్వానికి ఐఎంఏ ధన్యవాదాలు తెలిపింది.
మత సంబంధమైన వ్యవహారాలు, టూరిజం, తీర్థయాత్రలు అవసరమే కానీ.. వాటిని మరికొన్ని నెలలు ఆపవచ్చు అని ఐఎంఏ తెలిపింది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇలాంటి వాటికి ప్రజలను అనుమతిస్తే వీళ్లే సూపర్ స్ప్రెడర్లుగా మారి కరోనా థర్డ్ వేవ్‌కు కారణమవుతారని ఆ ప్రకటనలో ఐఎంఏ హెచ్చరించింది. కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా చెప్పింది. వచ్చే రెండు, మూడు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రం ఎలాంటి అలసత్వం లేకుండా వ్యవహరించాలని ఐఎంఏ సూచించింది. పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావటం సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కన్వర్ యాత్రకు అనుమతిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో IMA ఈ ప్రకటన చేసింది. సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.