4 Cong workers arrest: రాహుల్ గాంధీ ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో 4 కాంగ్రెస్ కార్యకర్తలు

ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచిది కాదు. కానీ ఇలాంటి ఆవేశపూర్వక ఘటనలపై నాకేం కోపం లేదు. ఈ చర్యల పరిణామాలను వారు తెలుసుకోలేరు’’ అని సీపీఎం, ఎస్ఎఫ్ఐ పేర్లు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు.

4 Cong workers arrest: కొద్ది రోజుల క్రితం వయనాడ్‭లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తల్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఈ దాడికి పాల్పడింది కేరళ అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలని కాంగ్రెస్ నేతలు ఆరోపించినప్పటికీ.. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల్నే అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

కార్యాలయంలోని మహాత్మ గాంధీ చిత్రపటాన్ని ధ్వంసం చేశారని, అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై సదరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వయనాడ్ పోలీసులు పేర్కొన్నారు. జూన్ 24న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం ఎస్ఎఫ్ఐ వయనాడ్ జిల్లా విభాగం రద్దైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్ట్)కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. ఆ కారణం చేతనే జిల్లా కమిటీని రద్దు చేసినట్లు సమాచారం.

దాడి అనంతరం రాహుల్ గాంధీ తన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచిది కాదు. కానీ ఇలాంటి ఆవేశపూర్వక ఘటనలపై నాకేం కోపం లేదు. ఈ చర్యల పరిణామాలను వారు తెలుసుకోలేరు’’ అని సీపీఎం, ఎస్ఎఫ్ఐ పేర్లు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు.

Siddaramaiah: గాంధీనే చంపారు.. నన్ను విడిచి పెడతారా? బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు