4 Killed Over 40 Missing In Jammu And Kashmir Flash Floods
Jammu and Kashmir Flash Floods : జమ్ముకశ్మీర్ లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు పోటెత్తాయి. హంజార్ లో ఒక్కసారిగా పోటెత్తిన వరదలతో ఇళ్లు కొట్టుకపోయాయి. నలుగురు మృతి చెందారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. 9 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారత వాయుసేన సహాయక చర్యలు చేపడుతోంది. మరోవైపు వరదల పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.
Read More : Supreme Court :కరోనా వల్ల అనాథలైన పిల్లల్ని గుర్తించటంలో ఆలస్యం చేయొద్దు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలకు కేంద్రం అండగా ఉంటుందని, ప్రతొక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కిష్ట్వార్ జిల్లాలో వరద పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. అక్కడి అధికారులతో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారు. ప్రజలను రక్షించడానికి, గల్లంతైన వ్యక్తులను గుర్తించడానికి ఆర్మీ, NDRF బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని, వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. కిష్ట్వార్ జిల్లాలో వరదలకి సంబంధించి జమ్ముకశ్మీర్ కు చెందిన ఎల్‌జీ, డీజీపీలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటమే తమ ప్రాధాన్యత అన్నారు.